ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (19:47 IST)

శ్రీకాకుళం జిల్లాలో వ్యభిచార గుట్టు రట్టు

Rocket
శ్రీకాకుళం జిల్లాలో అమ్మాయిల బలహీనతలను ఆసరా చేసుకుని వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచారం గృహాలపై పోలీసులు దాడి చేశారు. రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఈశ్వరప్రసాద్‌ తమ సిబ్బందితో ఏకకాలంలో రెండు లాడ్జీల్లో సోదాలు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. 
 
డే అండ్‌ నైట్‌ కూడలి సమీపంలో ఉన్న శ్రీరామ, ఎన్‌ఎస్‌ఆర్‌ లాడ్జీల్లో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బుధవారం మధ్యాహ్నం లాడ్జీల్లో ఆకస్మికంగా దాడులు చేశారు. లాడ్జీల్లో అసంఘీక కార్యకాలపాలు జరుపుతున్న ఐదు జంటలను పట్టుకున్నట్లు సీఐ చెప్పారు.