మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (15:31 IST)

పవన్‌పై రోజా ఫైర్... జగన్ ఎడమకాలి చిటికెన వేలి వెంట్రుక కూడా పీకలేడు..

rk roja
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్ రోడ్డుపై రౌడీలా రోడ్ షోలు చేస్తున్నాడని.. ఆయనకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు దింపాలని మంత్రి రోజా సవాల్ విసిరారు. పవన్ ఎన్ని విమర్శలు చేసినా జగన్ ఎడమకాలి చిటికెన వేలి వెంట్రుక కూడా పీకలేడని కౌంటర్ ఇచ్చారు.
 
ఎవరో రాసిచ్చిన మాటలను ఆవేశంగా చెబితే సరిపోదని రోజా విమర్శలు గుప్పించారు. 2024లో జరిగే ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ తిరుగులేని మెజార్టీతో గెలుస్తారని మంత్రి రోజా జోస్యం చెప్పారు. 
 
రాజకీయాలంటే.. ప్రతిరోజూ యుద్ధమేనని.. వీకెండ్‌లో మాత్రమే వచ్చి రాజకీయాలు చేస్తానంటే ఎలా కుదరదని వెల్లడించారు. సినిమాల్లో హీరో వేషాలు వేసే పవన్.. రాజకీయాల్లో జీరో వేషాలు వేస్తే ప్రజలు ఏమాత్రం నమ్మబోరని ఫైర్ అయ్యారు.