శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (12:47 IST)

ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం చేసిన పవన కళ్యాణ్

pawan kalyan
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీకి చెందిన మద్దతుదారుల గృహాలను కూల్చివేయడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. అందుకే వారికి అండగా నిలవాలని భావించానని చెప్పారు. పైగా, ఇప్పటం గ్రామస్థుల తెగువ తనకు బాగా నచ్చిందన్నారు. అమరావతి రైతులు కూడా ఇదే తెగువ చూపితే రాజధాని తరలిపోయేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఆయన ఆదివారం ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు అండగా ఉన్న ఇప్పటం గ్రామస్థలకసు తాను అండగా ఉంటానని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. వైకాపా గడప కూల్చేదాకా విశ్రమించబోనని ఆయన ఈ సందర్భంగా శపథం చేశారు. ఇప్పటచం గ్రామస్థుల తెగువ తనకు నచ్చిదన్నారు. అమరావతి రైతులు కూడా ఇదే తెగువ చూపితే రాజధాని తరలిపోయేది కాదన్నారు. 
 
ప్రజలు, రైతులు, ఇళ్లు, భూములకు తగిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకోవడం బాధాకరమన్నారు. ఈ విషయం తనను ఎంతగానో బాధిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.