గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (09:15 IST)

లష్కర్ రామయ్యకు పవన్ కళ్యాణ్ చేయూత.. రూ.2 లక్షలు బహుమతి

lashkar ramaiah
కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం లష్కర్ రామయ్యకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నగదు బహుమతితో సత్కరించారు. అన్నమయ్య డ్యాం తెగిపోయిన రోజు రాత్రి విధుల్లో ఉన్న లష్కర్ రామయ్య... తనకు తెలిసినవాళ్ళందరికీ ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. డ్యాం తెగిపోయేస్థితిలో ఉందని ఇళ్లు ఖాళీ  చేసి వెళ్లిపోవాలంటూ కోరారు. దీంతో అనేక మంది అర్థరాత్రి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. ఫలితంగా భారీ ప్రాణనష్టం తప్పింది. అలా అనేక మంది ప్రాణాలు కాపాడిన లష్కర్ రామయ్యను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు రూ.2 లక్షల చెక్కును తన సొంత డబ్బులతో ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, విచక్షణ లేకుండా ఇసుక తవ్వకాలకు పాల్పడటం వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకునిపోయిందన్నారు. చెట్లు నరికే వ్యక్తులు గరుడ పురాణం చదవాలని సూచించారు. మీ బాధ్యతారాహిత్యం వల్లే డ్యాం కొట్టుకునిపోయిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 
 
నాడు లష్కర్ రామయ్య లేకపోతే మరింత ప్రాణనష్టం జరిగేదని అభిప్రాయపడ్డారు. విపత్తు నిర్వహమ సంస్థ చేయాల్సిన పనిని రామయ్య చేశారని, ఫలితంగా దాదాపు 200 మంది ప్రాణాలను ఆయన కాపాడారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.