బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (13:48 IST)

అడ్మిన్ వేధింపులకు తాళలేక ... వాలంటీర్ ఆత్మహత్య!

గ్రామ స‌చివాల‌యం వ్య‌వస్థలో ఇంకా లుక‌లుక‌లు తొల‌గ‌డం లేదు. అతి త‌క్కువ వేత‌నాల‌కు ప‌నిచేస్తూ, వ‌లంటీర్లు తీవ్ర ఒత్తిడికి లోన‌వుతున్నారు. త‌ర‌చూ వ‌లంటీర్ల‌కు, అడ్మిన్ అధికారుల‌కు మ‌ధ్య వివాదాలు ప‌రిపాటి అవుతున్నాయి. స‌చివాల‌య వ్య‌వ‌స్థ ఇంకా స్థిరం కాలేద‌ని తెలియ‌జేస్తున్నాయి.

 
మహానాడు సచివాలయం అడ్మిన్ వేధింపులకు తాళలేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఒక వ‌లంటీరు డెత్ నోట్ రాశాడు. వెంకట రవి కుమార్(21) కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సచివాలయ సిబ్బంది ఒత్తిడే తన చావుకు కారణం అని లేఖ రాసి, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడా వాలంటీర్. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. 

 
రెండు రోజుల కిందట తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వెంకట రవి కుమార్ కనిపించటం లేదని అత‌ని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తుండ‌గా, వెంకట రవి కుమార్ శ‌వం కృష్ణా నది ఒడ్డున క‌నుగొన్నారు.