శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 3 నవంబరు 2021 (10:59 IST)

క‌డ‌ప‌లో స్థ‌లం ఇచ్చినందుకు సీఎంకు ఎల్.వి. ఇనిస్టిట్యూట్ కృత‌జ్ణ్న‌త‌లు

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుళ్ళపల్లి ఎన్‌ రావు, ఫౌండర్‌ మెంబర్‌ జి.ప్రతిభా రావు మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలో టెరిషియరీ కేర్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ ఏర్పాటుకు అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయంపై సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్ సీఎంను క‌లిశారు. ఏపీలో కాంప్రహెన్సివ్‌ ఐ కేర్‌కు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్, సీఎం వైఎస్‌ జగన్‌తో ప్రాధమికంగా చర్చలు జరిపారు.


అంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలు, వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళకుండా అంతర్జాతీయ స్ధాయిలో, అత్యాధునిక కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎల్‌ వి ప్రసాద్‌ కంటి ఆసుపత్రి బృందాన్ని సీఎం కోరారు. దానికి ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ టీం  అంగీకారం తెలిపింది. కంటికి సంబంధించి, అంధత్వ నివారణకు స్క్రీనింగ్‌ నుంచి సర్జరీ వరకూ అన్ని స్ధాయిలలోనూ అత్యాధునిక వైద్యం అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి సీఎం సూచించారు. 

 
రాష్ట్రంలో ఉన్న అన్ని అనాధ శరణాలయాలలోని చిన్నారులకు నేత్ర వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా చేసేందుకు ఎల్‌ వి ప్రసాద్‌ టీం ముందుకొచ్చింది. కంటి వైద్యానికి సంబంధించి దేశంలోనే ప్రముఖ ఆసుపత్రిగా పేరొందిన ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్ ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో న‌డిచేందుకు సిద్ధం అయింది. ఈ సమావేశంలో ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్ట్సిట్యూట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ రెడ్డి పప్పూరు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.