గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (10:08 IST)

ఫ్యాన్స్‌కు దీపావళి కానుక ఇచ్చిన 'అఖండ'

నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం అఖండ. ఇది వీరిద్దరి కాంబోలో వస్తున్న వ్యాట్రిక్ మూవీ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
 
ఇప్పటికే బాలకృష్ణను అఖండగా పరిచయం చేస్తూ వదిలిన టీజర్‌కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి, దీపావళి కానుకగా టైటిల్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. 4వ తేదీన ఉదయం 11:43 నిమిషాలకు సాంగ్ టీజర్ వెలువడనుంది.