శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (19:09 IST)

అఖండ తాజా అప్డేట్.. దీపావళి కానుకగా టైటిల్ సాంగ్ రిలీజ్

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' రూపొందింది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకు కారణం బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడమే.
 
బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి, దీపావళి కానుకగా టైటిల్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. 4వ తేదీన ఉదయం 11:43 నిమిషాలకు సాంగ్ టీజర్ వెలువడనుంది. ఇక 8వ తేదీన ఫుల్ సాంగును లిరికల్ వీడియోగా వదలనున్నట్టుగా చెప్పారు.
 
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ కనువిందు చేయనుండగా, జగపతిబాబు .. శ్రీకాంత్ .. పూర్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ - బోయపాటికి సరైన హిట్ పడలేదు. ఈ నేపథ్యంలో వారికి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ ఇస్తుందేమో చూడాలి.