నవరాత్రి.. తొమ్మిది రోజులూ అఖండ దీపం.. ఇలా వెలిగిస్తే..?
నవరాత్రి పండుగ గురువారం, అక్టోబర్ 7 నుండి ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రకాలుగా పూజిస్తారు. ఈ సమయంలో, అమ్మవారిని పూజించేవారు తొమ్మిది రోజుల పాటు ప్రకాశించే దీపాన్ని వెలిగిస్తారు.
తొమ్మిది రోజుల పాటు ఈ దీపం ఆరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ పగలని విధంగా దీపం వెలిగించుకోవాలి. ఎరుపు రంగు వస్త్రం పరచి దానిపై ప్రమిదను వుంచాలి. ఆ ప్రమిదపైనే ఆరని దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని నేరుగా నేలపై ఉంచవద్దు.
దీన్ని అఖండ దీపం అంటారు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు.. ఆర్పేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. సమస్య పరిష్కారానికి ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా అమ్మవారిని పూర్తి విశ్వాసంతో పూజించడం చేయాలి. ఈ దీపం తొమ్మిది రోజులు నిరంతరంగా వెలుగుతూనే ఉండాలి. దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్పకూడదు. చేతులతో ఈ దీపాన్ని తాకవద్దు.
ఈ దీపం కోసం నెయ్యిని ఉపయోగించాలి, ఇది సాధ్యం కాకపోతే, ఆవనూనె లేదా నువ్వుల నూనె ఉపయోగించండి. ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించడం సాధ్యం కాకపోతే.. సమీప దేవాలయానికి వెళ్లి, ఈ అఖండ దీపానికి నెయ్యి లేదా నూనె ఇచ్చి, అమ్మవారి నామస్మరణ చేయండి.