రోడ్డు వేయాలన్న గ్రామ ప్రజలు... లాఠీలతో చితకబాదిన పోలీసులు.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకునిపోయింది. నిధులు లేకపోవడంతో ఒక్కటంటే ఒక్క రోడ్డును కూడా బాగు చేయలేని దుస్థితి నెలకొంది. అదేసమయంలో అనేక గ్రామాలకు చెందిన ప్రజలు తమకు రోడ్డు వేయాలంటూ కోరుతున్నారు. శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్నారు. ఇలాంటి వారిపై అధికార పార్టీ నేతలు, అధికారులు ప్రోద్బలంతో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి రహదారి నిర్మించాలంటూ గ్రామస్థులు ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను నిడమర్రు పోలీసులు అడ్డుకున్నారు. లాఠీలకు పనిచెప్పి పాదయాత్ర చేస్తున్నవారిని చెదరగొట్టారు.
పలువురిని అరెస్టు చేసి నిడమర్రు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అడవికొలను గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రోడ్డు వేయాలని శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే.. పోలీసులు లాఠీలతో చితకబాదడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.