గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (10:48 IST)

పెళ్లి చేసుకుంటా అని లాడ్జికి పిలిచి.. బాలికపై లైంగిక దాడి

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటా అని పిలిచి ఓ యువకుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ద్వారకా తిరుమల ఎస్ఐ టి.వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం… పంగిడిగూడెం కు చెందిన పదిహేనేళ్ల బాలిక తో నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఏడాదికాలంగా ప్రేమిస్తున్నా అని చెప్పి బాలికను బుట్టలో వేసుకున్నాడు.
 
ఇక ఈ నెల 19వ తేదీన పెళ్లి చేసుకుంటానని ద్వారకా తిరుమలకు బాలికను తీసుకు వెళ్ళాడు. అక్కడ ఓ లాడ్జి తీసుకుని బాలిక పై అత్యాచారం చేసి అనంతరం బస్టాండ్ లో వదిలిపెట్టాడు. తరవాత తనకు పెళ్లి అయిందని చెప్పి బాలికను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు.
 
దాంతో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు యువకుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.