ఏపీ సీఐడీ చీఫ్ పై ఏం చర్యలు తీసుకున్నారు?: కేంద్ర హోంశాఖ
ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌పై నమోదైన కేసులో ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
సునీల్ కుమార్ సతీమణి అరుణ తెలంగాణ సీఐడీ విభాగానికి చేసిన ఫిర్యాదు, అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి వచ్చిన లేఖను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు పంపించారు.
ఈ వ్యవహారంలో నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి డీజీపీకి సూచించారు.