‘కరోనా’ వివరాలపై శ్వేతపత్రం: కన్నా డిమాండ్
ఏపీ ప్రభుత్వ వైఖరి వల్ల ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయో, క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల సమాచారం ఇవ్వాలని అదే విధంగా, ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిని ఎంత మందిని గుర్తించారన్న వివరాలను తెలియజేయాలని కోరారు.
‘కరోనా’పై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో సీఎం జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ రాశారు.