శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:32 IST)

దుర్గ గుడి వరకు వచ్చి దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయిన బోండా ఉమ.. ఎందుకు..?

ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే బోండా ఉమ మరోసారి అలాంటిదే చేశారు. ఈసారి ఏకంగా శక్తి స్వరూపిణి అమ్మవారు కొలువైన దుర్గగుడిలోనే అలకపాన్పు ఎక్కారు. ఆలయ అధికారులు తనను పట్టించుకోలేదని, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నా ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఎమ్మెల్యే తనను పిలవలేదని బాధపడ్డారు బోండా ఉమ. అధికారుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు.
 
అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులను కూడా దర్శనానికి పోనివ్వకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయారు బోండా ఉమ. దేవదాయ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతోనే తాము నడుచుకున్నామే తప్ప ఎమ్మెల్యేను అవమానించాల్సిన అవసరం మాకు లేదంటున్నారు దేవదాయ శాఖ అధికారులు. 
 
పట్టువస్త్రాలు సమర్పించే విషయం తాము చెప్పకున్నా ఎమ్మెల్యేగా బోండా ఉమ పాల్గొనవచ్చు అంటున్నారు. అయితే కావాలనే బోండా ఉమ అమ్మవారి చెంత రాద్దాంతం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.