శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (16:20 IST)

మంగళవారం అంటే లక్ష్మీదేవి.. మరి ఆరోజున ఈ మంత్రాన్ని జపిస్తే..?

మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి దీపారాధను నైవేద్యాలు చేయడం వలన అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. దానికి తోడుగా ఈ మంత్రాన్ని జపిస్తే...
 
''చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్''
 
ఈతిభాదలు తొలగిపోతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రార్థించేటప్పుడు పూజామందిరంలో రంగు ముగ్గులు వేసి, వాటిపే దీపాలు వెలిగించుకోవాలి. ఇలా ప్రతి మంగళ, శుక్ర వారాల్లో చేస్తే అమ్మవారు తప్పకుండా ఆ ఇంటికి దర్శనపిస్తారని నమ్మకం.