దసర పండుగ ఎలా వచ్చిందో తెలుసా..?
దసరా పండుగ హిందువుల చాలా ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయ దశమి కలిస్తే దసరా పండుగ అంటారు. ఈ దసరా పండుగను శరన్నవరాత్రి, నవరాత్రి అని కూడా అంటారు. ఈ నవరాత్రులతో మెుదటి 3 రోజులు పార్వతీదేవిని పూజిస్తారు.
తరువాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివర 3 రోజులు సరస్వతి దేవిని పూజిస్తుంటారు. ఈ నవరాత్రులతో బొమ్మలను కొలువు పెట్టడం ఆనవాయితీ. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అంటే.. అమావాస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయదశమి నాడే రాముడు రావణుని గెలిచిన రోజు. అలానే పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై వారి ఆయుధాలను తిరిగి తీసిన రోజు.
దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజునే ఈ దసరా పండుగను జరుపుకుంటారు.