గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 31 జులై 2019 (16:36 IST)

భార్య టార్చర్ తట్టుకోలేక.. ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఉరేసుకున్నాడు.. ఎక్కడ?

భార్యతో తరచూ గొడవలు.. మరోవైపు ఆర్థిక సమస్యలు. చాలీ చాలని జీతం. ఏం చేయాలో పాలుపోలేదు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఆత్మహత్య స్నేహితులందరికీ తెలియాలనుకున్నాడు. ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేసి స్నేహితులతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
చిత్తూరు జిల్లా తిరుచానూరు ముత్యాలమ్మ వీధికి చెందిన గోదావరిరెడ్డి స్థానికంగా పెళ్ళి అలంకరణ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొత్తగా గోదావరిరెడ్డికి పెళ్ళి అయ్యింది. ఇంట్లో చాలీచాలని జీతంతో భార్య తరచూ గొడవలు పెడుతూ వస్తుండేది. 
 
అయితే క్షణికావేశంలో గోదావరి రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పాడిపేట సమీపంలోని ఒక ప్రాంతంలోకి వెళ్ళాడు. ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేశాడు. స్నేహితులందరికీ చూపించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. స్నేహితులు వద్దని వారిస్తున్నా పట్టించుకోలేదు. లైవ్‌లోనే ఉరివేసుకుని చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేహితులు కన్నీంటి పర్యాంతమయ్యారు.