గూగుల్‌పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్.. ఆ డేటాను తొలగించారు..

ప్రతి చిన్న విషయానికి గూగుల్, వికీపీడియాలను చూసేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే గూగుల్ కొన్ని పొరపాట్లు చేస్తూ వస్తోంది. ఇటీవల నందమూరి హీరో బాలకృష్ణ డెత్ డేట్‌ను చూపెట్టి గూగుల్ వివాదాన్ని కొనితెచ్చుక

బుధవారం, 10 అక్టోబరు 2018 (16:07 IST)
ప్రతి చిన్న విషయానికి గూగుల్, వికీపీడియాలను చూసేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే గూగుల్ కొన్ని పొరపాట్లు చేస్తూ వస్తోంది. ఇటీవల నందమూరి హీరో బాలకృష్ణ డెత్ డేట్‌ను చూపెట్టి గూగుల్ వివాదాన్ని కొనితెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని వికీపీడియాలో తప్పుగా చూపిస్తోంది. 
 
బాలయ్య 1913 నవంబర్‌ 2న జన్మించి, 1995 జూలై 19న మరణించినట్లు చూపిస్తోంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై బాలకృష్ణ ఫ్యాన్స్ గూగుల్‌పై మండిపడుతున్నారు. వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు. దీంతో గూగుల్ ఆ తప్పుడు సమాచారాన్ని తొలగించింది.
 
నిజానికి గూగుల్‌లో ఇలాంటి తప్పులు దొర్లడం కొత్తేమీకాదు. గతంలో కూడా గూగుల్ ఇలాంటి పొరపాట్లు చాలానే చేసింది. ప్రస్తుత ప్రధానినరేంద్ర మోడీని భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అని చూపించడం, మహేష్ బాబు గురించి సెర్చ్ చేస్తే హాలీవుడ్ హీరోను చూపించడం వంటివి చాలానే వున్నాయి. అందుకే కనీస పరిజ్ఞానం కోసం గూగుల్‌ని నమ్మకుండా పుస్తకాలు తిరగేయాలని.. వార్తాపత్రికలను కాస్త చదవాలని జనరల్ నాలెడ్జ్‌ని పెంచుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. 

అన్నీ చూడండి

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments