ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జనవరి 2025 (18:40 IST)

చంద్రబాబుకు గవర్నర్‌ పదవి.. పవన్ సీఎం కాబోతున్నారా? నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం..?

nara lokesh
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అదరగొడుతున్నారు. పవన్ పనితీరు చూసి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు సీఎం పదవి అంటగట్టాలని యోచిస్తున్నట్లు ఏపీలో చర్చ సాగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కాబోతున్నారా? అనే ప్రశ్నలు సంచలనంగా మారాయి. 
 
కాగా ఎప్పుడు నుంచో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా గెలిస్తే రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా వారు డిమాండ్ చేశారు. కానీ పవన్ పలు కీలక శాఖల మంత్రిత్వం సహా ఉప ముఖ్యమంత్రిగా చేశారు. 
 
ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా పవన్.. వరల్డ్ వైడ్‌గా బాగా ఫేమస్ అయ్యారు. ఇక ఇదిలా ఉండగా ఇపుడు పవన్ కళ్యాణ్ సీఎం అనే మాట ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు వయస్సు రీత్యా కేంద్రంలో ఉప రాష్ట్రపతి కావచ్చని లేదా ఎన్డీయే నిర్ణయంతో గౌరవ గవర్నర్‌గా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా మారితే చంద్రబాబు సలహాలు సూచనలు నేతృత్వంలో ముఖ్యమంత్రి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే చర్చ సాగుతోంది. దీనిపైనే మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. గతంలో కూడా పవన్ సపోర్ట్‌తో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
 
కానీ అపుడు పవన్‌ని వారు పక్కన పెట్టేసారు. ఇప్పుడు కూడా పవన్‌ను పక్కనపెట్టేస్తారని టాక్ వస్తోంది. మరి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని ఇప్పుడే టీడీపీలో చర్చ, డిమాండ్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ వాదనలను ఎలా తీసుకుంటారు. 
 
కుమారుడికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి... పవన్‌ను సీఎం చేస్తారా అనేది తెలియాల్సి వుంది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబు సిద్ధంగా వున్నారా.. అందుకే నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పోస్టుపై వార్తలు వచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 
 
అయితే ఈ వ్యవహారంపై వైకాపా వర్గాల్లో టాక్ వేరేలా వుంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం పోస్టును పవన్ నుంచి పీకేయాలనే డిమాండ్ వచ్చిందని.. ఈ డిమాండ్ ద్వారా పవన్‌ను పక్కన బెట్టేస్తే.. కూటమి సర్కారు కూలిపోయే అవకాశం వుందని.. అందుకే వైకాపా లీడర్ జగన్ కూడా 3-4 నెలల్లో కూటమి సర్కారు పడిపోతుందని కామెంట్లు చేశారనే టాక్ వినిపిస్తోంది. 
 
టీడీపీ సొంత పార్టీగా బలంగా ఏపీలో ఆవిర్భవించాలనే క్రమంలోనే.. నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని అంటగట్టే ప్రయత్నంలో భాగంగానే ఆ పార్టీ నేతలు పలుసార్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది. 
 
అయితే మరో పదేళ్ల పాటు ఏపీకి చంద్రబాబే సీఎంగా ఉండాలని పదేపదే చెబుతున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయన్ని గౌరవించాలి అంటూ ఫ్యాన్స్‌కి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.