మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:34 IST)

పిన్నిపై అత్యాచారం... నిందలేస్తావా అంటూ బాధితురాలిపై దాడి

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తల్లిలాంటి చిన్నమ్మ (పిన్ని)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని ఆ కామాంధుడి తల్లిదండ్రుల దృష్టికి తీసుకె

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తల్లిలాంటి చిన్నమ్మ (పిన్ని)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని ఆ కామాంధుడి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తే.. బిడ్డలాంటి వాడిపై లేనిపోని నిందలు వేస్తావా అంటూ చితకబాదారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సూర్యాపేట జిల్లా రాజా నాయక్‌ తండాకి చెందిన నాగమణి భర్త రాజేందర్ యేడాది కిందట ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కూలిపనులు చేసుకుంటూ తన ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటూ వస్తోంది. ఆమె ఇంటికి సమీపంలోనే తన భర్త తరపు పెదనాన్న కుటుంబం నివాసం ఉంటుంది. ఈ కుటుంబంలోనే నాగమణికి వరసకు కుమారుడైన శ్రీకాంత్ ఉన్నాడు. ఇతను నాగమణిపై కన్నేశాడు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న బాధితురాలిని బలవంతం నోట్లో చీర కుక్కి తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోగా ఆరుబయటకు తీసుకెళ్ళి అత్యాచారయత్నం చేశాడు. ఆ తర్వాత స్పృహ వచ్చి మేల్కొన్న నాగమణి కేకలు వేయగా మళ్లీ నోరు నొక్కి తాళ్ళతో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వరుసకు తల్లిని అవుతానని తనను ఏమీ చేయొద్దని ప్రాధేయపడినా వినకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పిల్లలను చంపేస్తాడని బెదిరించాడు. 
 
తన కామవాంఛ తీర్చుకున్న తర్వాత శ్రీకాంత్ ఆమెను బెదిరించి అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. బాధితురాలు అక్కడ నుంచి ఇంటికి చేరుకుని నిందితుడి కుటుంబానికి చెబితే కొడుకు వరుస వాడిపై నిందలు వేస్తావా అంటూ బాధితురాలిపైనే దాడి చేశారు. ఒంటి నిండా గాయాలతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.