గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 4 జులై 2019 (14:40 IST)

ముగ్గురు బిడ్డల తండ్రిని ప్రేమించి.. నిజం తెలుసుకుని మంటల్లో దహనమైపోయింది....

ముగ్గురు బిడ్డల తండ్రిని ప్రేమించిన ఓ యువతి నిజం తెలుసుకుని మంటల్లో తనను తాను దహించుకుంది. ఇటీవల వైజాగ్‌లో నడి రోడ్డుపై నర్సు ఒకరు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాగా కాలిన గాయాలతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది. ఈ కేసులోని వాస్తవాలను పోలీసులు కనుగొన్నారు. 
 
స్థానికంగా ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ వచ్చిన ఓ యువతి... అదే ఆస్పత్రిలో ఆంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చిన నరేంద్ర అనే డ్రైవర్‌ను ప్రేమించింది. నిజానికి అతనికి అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మాత్రం ఆమె గ్రహించలేకపోయింది. 
 
ఈ క్రమంలో శివాజీపాలెం రోడ్‌లో నడుచుకుంటూ వెళుతున్న కావ్య, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. నడిరోడ్డుపై ఓ యువతి ఉన్నట్టుండి మంటల్లో కాలుతుండడాన్ని గమనించిన స్థానికులు, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆపై ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
60 శాతం కాలిన గాయాలతో ఉన్న కావ్య విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె కాల్ డేటాను, చాటింగ్ వివరాలను పరిశీలించిన తర్వాత ప్రేమ వ్యవహారం ఈ ఆత్మహత్య వెనుక ఉందని గుర్తించామని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పెళ్లయి, ముగ్గురు బిడ్డల తండ్రిని ప్రేమించిన ఆమె, విషయం తెలిసిన తర్వాత ఆ ప్రేమను వదులుకోలేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.