గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (12:10 IST)

ఫామ్ హౌజ్‌లో పనిచేసిన పాపం.. వివాహితపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

అవును.. ఫామ్ హౌజ్‌లో పనిచేసిన పాపం.. ఆ వివాహిత కామాంధులకు బలైపోయింది. మొత్తం నలుగురు కామాంధులు వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా భర్తను పక్కగదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుపడ్డారు. అయితే స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే, హహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వరం మండలం హర్షగూడలో వున్న ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తున్న చందు, అతని భార్య పనిచేస్తున్నారు. చందుతో ఫాంహౌజ్ యజమానులైన రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డిలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చందుపై ఆవేశంతో రగిలిపోయిన ఆ ఇద్దరు.. భార్యాభర్తలను ఓ గదిలో బంధించారు. 
 
అనంతరం చందు భార్యను మరో గదిలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు స్నేహితులను రప్పించి.. వాళ్లతోనూ అత్యాచారం చేయించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.