శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (15:57 IST)

పంట పొలాల్లో వివాహిత దారుణ హత్య.. బండరాయితో మోది కత్తితో..?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా పంట పొలంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని అనంతరాయఏని సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దగ

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా పంట పొలంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని అనంతరాయఏని సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దగదర్తి మండలం కాటారాయపాడుకు చెందిన శేషమ్మ (40) తన స్వగ్రామమైన అనంతరాయఏనిలో జరుగుతున్న తిరునాళ్లను చూసేందుకు వచ్చింది. 
 
ఈ క్రమంలో తిరునాళ్ల చూసి తిరుగు ప్రయాణమైంది. అయితే సోమవారం అనంతరాయఏని సమీప పంట పొలాల్లో శవమై తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బండరాయితో మోది కత్తితో గొంతు కోసేసిన ఆనవాళ్లను గుర్తించారు. 
 
అక్కడే సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్యను ఛేదించేందుకు డాగ్‌స్క్వాడ్‌ రంగంలోకి దిగింది. మృతురాలు పడి ఉన్న ప్రదేశంలో తిరిగివచ్చిన డాగ్‌స్క్వాడ్‌ ఆత్మకూరు పట్టణం వైపునకు రావటంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెను ఎందుకు హత్య చేశారు.. ఆమెపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టారు.