ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (10:54 IST)

బాల్య వివాహం చేశారు... భర్తతో బతుకు నరకమైంది....

తనకు బాల్య వివాహం చేశారు. పైగా, తన భర్తతో బతుకునరకమైంది. జీవితంలో ఏదో సాధించాలని అనుకున్నా.. చివరకు అర్థాంతరంగా తనువు చాలించాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదంటూ ఓ వివాహిత తన మనోవేదనను వెళ్లగక్కుతూ బలవన్మరణానికి పాల్పడింది. 
 
హైదరాబాద్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఉట్నూరు గ్రామానికి చెందిన నర్సయ్య, లక్ష్మీ దంపతుల కుమార్తె గీతాంజలి (26) అనే కుమార్తె ఉంది. ఈమెకు గత 2008లో అంటే 16 ఏళ్ల వయస్సులోనే నిర్మల్ కడెం మండలం లక్ష్మీపురానికి చెందిన ప్రైవేట్ లెక్చరర్ శంకర్‌తో వివాహం జరిపించారు. 
 
వివాహ సమయంలో వధువు కంటే వరుడు వయసు 15 యేళ్లు ఎక్కువ. అయినప్పటికీ వీరి సంసార జీవితానికి గుర్తుగా ఇద్దరు సాయి వర్ణిత్ (9), సాయి వైశ్విక్ (6)లు జన్మించారు. ప్రస్తుతం అమె భర్త శంకర్ మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని అక్షయ్ ఇనిస్టిట్యూట్‌లో గీతాంజలి ఎస్ఐ కోచింగ్ తీసుకుంటోంది. ఈమె గాయత్రీ నగర్‌లోని ఓ అద్దె ఇంటిలో ఉంటోంది.
 
ఈ క్రమంలో సంక్రాంతి తన ఇద్దరు కుమారులను పుట్టింటికి పంపించిన గీతాంజలి ఒక్కరే కోచింగ్ కోసం సిద్ధమవుతుంది. శుక్రవారం రాత్రి ఫోన్‌లో కుటుంబ సభ్యులతో చివరిగా మాట్లాడిన గీతాంజలి అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా శనివారం ఉదయం ఇంకా తలుపు తెరకపోవడంతో ఇంటి యజమాని తలుపుతట్టిచూడగా డోర్ తెరువకపోవడంతో గమనించి చూస్తే ఆత్మహత్య చేసుకుని కన్పించింది.