సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:28 IST)

నటన నేర్చుకోవాలంటే దుస్తులిప్పేయాల్సిందే: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హుకుం

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకోవాలంటే అమ్మాయిలు అబ్బాయిలు దుస్తులు విప్పేయాల్సిందేనని ఆ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ వర్మ హుకుం జారీచేశారు. ఈ పని చేసేందుకు నిరాకరించిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఆ డైరెక్టర్ జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
 
హైదరాబాద్ నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో ఉన్న సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌కు వినయ్ వర్మపై ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బాధిత యువతితో పటు మరికొందరు యువతులు ఇటీవల ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అక్కడ డైరెక్టరుగా ఉన్న వర్మ.. నటన నేర్చుకోవాలంటే ఎలాంటి భేషజం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు బట్టలు విప్పేయాలంటూ కోరాడు.
 
దీంతో షాక్ అయిన బాధిత యువతి బట్టలు విప్పడానికి నిరాకరించి, అక్కడ నుంచి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించి, లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. పైగా శిక్షణ పేరుతో యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈమెకు మరికొంతమంది అమ్మాయిలు జతకలిశారు. 
 
దీనిపై వినయ్ వర్మ స్పందిస్తూ, నటనలో పై దుస్తులు తీసేయడం కామన్ అని సెలవిస్తున్నారు. యాక్టింగ్‌పై ఆసక్తి లేకపోవడంతోనే ఆరోపణలు చేస్తుందని అంటున్నాడు. ఇక అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న వినయ్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ని మూసివేయాలన్నారు.