సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:18 IST)

శబరిమల తరహాలో మసీదుల్లో మహిళలు ప్రవేశం కల్పించండి..

శబరిమల తరహాలో సుప్రసిద్ధ మసీదుల్లో తమకు ప్రవేశం కల్పించాలని.. ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం సాధించుకున్న ముస్లిం మహిళలు.. తాజాగా మసీదుల్లోకి ముస్లీం మహిళలు రాకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలనీ కోరారు. ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేలా అనుమతిని ఇవ్వాలని కోరుతూ పూణెకి చెందిన దంపతులు సుప్రీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కూడా సానుకాలంగా స్పందించింది. మసీదుల్లో ముస్లిం మహిళలక ప్రవేశానికి చట్టబద్ధంగా అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం పరిశీలించింది. కెనడా, మక్కా వంటి సుప్రసిద్ధ మసీదుల్లో మహిళలను అనుమతిస్తున్నారని న్యాయవాదులు తెలపడంతో ఈ పిటీషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. 
 
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసులో తీర్పు ఇచ్చినందువల్లనే ఈ పిటీషన్‌ను కూడా స్వీకరించినట్టు జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పురుషులకు సమానంగా స్త్రీలు కూడా మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చే అంశంపై విచారణ జరుపనున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.