శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (18:37 IST)

ఒకే ఒక్కసారి సురక్షితమైన శృంగారం చేశా.. నేను కన్యనేనా?

డిగ్రీ పూర్తి చేశాను. నా కాలేజీ రోజుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో ఒత్తిడి చేసి బ్రతిమలాడితే ఒకే ఒక్కసారి సురక్షితమైన శృంగారం చేశాను. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నాను. ఐతే కొన్ని మనస్పర్థల కారణంగా నా బోయ్‌ఫ్రెండ్ నేను విడిపోయాం. అతడు ఫారిన్ వెళ్లిపోయాడు. ఇపుడు నాకు వివాహం చేయాలని మా పెద్దలు నిర్ణయించారు. పెళ్లికి ముందే శృంగారం చేసిన నేను ఇపుడు కన్యనా? నా భర్తకు నేను కన్యను కాదనే విషయం తెలుస్తుదంటారా? 
 
అసలు మీరు వివాహానికి ముందు.. అంటే కాలేజీ రోజుల్లో శృంగారం అనుభవించారని చెప్పారు. పెళ్లికి ముందు ఇలాంటి అనుభూతి పొందాలనే ఆలోచన చాలా ప్రమాదకరం. కన్యత్వం అనేది కొంతమంది మాత్రమే పట్టించుకునే విషయం. స్త్రీలలో హైమన్ పొర ఉన్నంత మాత్రాన వారిని కన్య అని అనేందుకు వీలులేదు. అలాగే, తొలిసారి శృంగారంలో పాల్గొన్నపుడు రక్తస్రావం అవ్వాలన్న నిబంధనేదీ లేదు. అందువల్ల శృంగారంలో పాల్గొన్నట్టు మీ అంతట మీరు చెపితేగానీ, మీరు కన్య కాదనే విషయం ఎవరికీ తెలియదు.