శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:21 IST)

వొదినతో శృంగారం చేసా... ప్రెగ్నెంట్ అయ్యింది... చచ్చిపోతానని బెదిరిస్తోంది...

నేను నా చదువు కారణంగా మా పెద్దమ్మ వాళ్ల హౌజ్‌లో ఉంటున్నా. మా పెద్దమ్మకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వరసకు నాకు అన్నయ్య. అతడికి పెళ్ళయి నాలుగు సవంత్సరాలు అయింది. ఒక పాప కూడా. అయితే వాళ్లింట్లో వుండే నేను కాలేజీకి వెళ్ళడం కాకుండా చిన్నచిన్న హెల్ప్ చేయడం చేస్తుంటా. అలా మా అన్నయ్య వైఫ్‌కి(వదిన) కూడా చాలా హెల్ప్ చేస్తుంటా. అలా మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. డైలీ హోమ్‌కి వచ్చాక కాలేజి విశేషాలు అవి అడుగుతూ కబుర్లు చెప్పుకుంటాం.
 
అలాగే చాట్ చేసుకుంటాం. అలా హ్యాపీగా ఉండేవాళ్లం. నేను ఫ్యామిలీని చూడటానికి మా సొంత వూరుకి వెళ్ళినప్పుడు నాకు ఒక మెసేజ్ చేసింది మా వొదిన. నిన్ను చూడలేక ఉండలేను, చాలా బోర్‌గా ఫీల్ అవుతున్నాను అని. అంతేకాదు అన్నయ్యతో కలిసి ఆ నెక్స్ట్ రోజే మా ఊరు వచ్చేసింది. నేను ఏమిటి వదినా వచ్చారు అంటే... నిన్ను ప్రేమిస్తున్నా నీ కోసమే వచ్చా అని అంది. వారం రోజుల తర్వాత వెళ్లిపోయారు. వాళ్లు వెళ్ళిన ఒక వారంలో నేను కూడా ఆ వూరికి వెళ్ళిపోయా.
 
అక్కడ కూడా ఆమె నాతో విచిత్రంగా ప్రవర్తించడం చేసింది. ఏమిటి వదినా అని అడిగితే మనం ఒకసారి శృంగారం చేద్దాం అని అడిగింది. అలా చేయడం తప్పు.. అని అడిగిన ప్రతిసారీ చెప్పా. చాలాసార్లు వద్దు తప్పు అని చెప్పినా వినేది కాదు. మా ఫ్రెండ్‌తో చెప్తే, వాడు తప్పు ఏమి వుంది... ఒకసారి కదా చేయమన్నాడు. నాకు కూడా ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటది అని సరే అన్నా. అలా మేము శారీరకంగా కలిశాం. అలా ఉండగా ఆ నెక్స్ట్ డే నుంచి తనుక ఎపుడు కావాలంటే అపుడు చేయాలంటూ ఇబ్బంది పెడుతుంది. నేను తప్పించుకోలేక ఏదో చేస్తున్నా. రోజూ శృంగారం చేస్తావా లేదా అని ఒత్తిడి చేస్తుండటంతో వల్లకాక నేను ఆ ఇంటిని వదిలిపెట్టి ఫ్రెండ్‌తో హాస్టల్లో వుంటున్నా. 
 
అలా ఉండగా 5 నెలలు తర్వాత తను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఈ విషయంపై మా అన్నయ్య వదినను నిలదీశాడట. నీ ప్రెగ్నెంట్‌కి కారణం ఎవరు. మనం శృంగారం చేయలేదు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు అని మా అన్నయ్య అడుగుతున్నారట. దానికి కారణం మనమేననీ, తప్పు అయిపోయింది అని మీ అన్నయ్య వద్ద ఒప్పుకుందాం లేకపోతే మన మెసేజెస్, ఫొటోలన్నీ బయటపెట్టి ఇద్దరం చచ్చిపోదాం. నువ్వు దీనికి ఒప్పుకోకపోతే నేనే లెటర్ రాసి చచ్చిపోతా. ఐతే నా చావుకి కారణం నీవే అని అని రాస్తా లెటర్‌లో అని అంటుంది. నా కాపురం కాపాడు దయచేసి అంటుంది. అలా నేను ఒప్పుకుంటే నా ఫ్యామిలి నన్ను వెలివేస్తారు. ఏమి చేయాలో తెలియడంలేదు. డైలీ ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. ఈ సమస్య నుండి తప్పించుకునే సలహా ఇవ్వండి నాకు.
 
అసలు పెళ్లయిన కొత్త జంట ఇంట్లోకి మిమ్మల్ని వుంచేందుకు అంగీకరించడమే ఆ కుటుంబ పెద్దలు చేసిన పెద్ద తప్పు. ఎవ్వరూ లేని ఇంట్లో వంటరిగా వున్న ఆమెతో సన్నిహితులుగా మారారు. సహజంగానే ఇంట్లో వంటరిగా వుండేవారికి తోడుగా వున్నవారితో స్నేహం కుదురుతుంది. పైగా ఆమె కొత్తగా పెళ్లయి వచ్చింది. మీ అన్నయ్య ఉద్యోగరీత్యా ఇంట్లో లేకుండా వెళ్లిపోయాడు. అలాంటి సమయంలో మీరు ఆమెతో సన్నిహితంగా మారిపోయారు. పరస్పర ఆకర్షణ కలిగింది. శృంగారంలో పాల్గొందాం అని అడిగినప్పుడే మీరు ఇల్లు వదిలి ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోవాల్సింది.
 
స్నేహితుడు చెప్పాడు కదా అని చేశానంటున్నారు... అతడు మరో పని చేయమంటే చేసేస్తారా? ఇది జీవితాలకు సంబంధించిన విషయం. తప్పు చేశారు కాబట్టి మీరు దాన్ని ఒప్పుకోక తప్పదు. తప్పు అంగీకరిస్తే కుటుంబం నుంచి వెలివేస్తారని మీకు ముందు తెలియదా? తెలిసి కూడా చేశారు. మీరిద్దరూ చేసిన దానికి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వారి చేతుల్లోనే వుంటుంది. చేసిన తప్పు నుంచి తప్పించుకునే మార్గాలు వెతికే కంటే తప్పును ఒప్పుకోవడమే సరైన మార్గం. ఎందుకంటే... మీరు తప్పించుకుంటే ఆమె చనిపోతానని చెప్పిన మాట నిజం చేసే అవకాశం లేకపోలేదు. అప్పుడెలా తప్పించుకోగలరు?