మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (18:25 IST)

యాదగిరి గుట్టపై విషం తాగిన ప్రేమ జంట.. పెద్దలకు భయపడి?

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమపెళ్లికి తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదోనని భయపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరుకు చెందిన తౌట స్వాతి, కోడూరి నవీన్‌లు కొంత కాలంగా ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది.
 
వీరిద్దరూ శనివారం ఉదయం ఇంటి నుండి పారిపోయి వచ్చారు. రాత్రి వరకూ భువనగిరిలొనే గడిపిన ఇద్దరూ 
ఆదివారం ఉదయం యాదగిరి గుట్టపై విషం తాగి భువనగిరిలో ఉంటున్న తన స్నేహితులకు ఫోను ద్వారా సమాచారం ఇచ్చారు. స్నేహితులు 100కు సమాచారం ఇవ్వడంతో వారిని  ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరు ఇరువురిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.