శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (14:50 IST)

తక్కువ ధరకే విల్లాల పేరుతో ఘరానా మోసం.. నిందితుడి అరెస్ట్

తక్కువ ధరకే విల్లాల పేరుతో దమరి ఎస్టేట్స్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పంజాగుట్ట పోలీసుల కథనం మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గ్ గ్రామానికి చెందిన అనిత ఫిర్యాదు మేరకు దమరి ఎస్టేట్స్ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ సుమన్ మీడియాస్ పేరుతో చెర్వుపల్లి సుమన్ అలియాస్ సుమన్ బాబుపై కేసు నమోదైంది.

పంజాగుట్టలోని ద్వారాకపురి కాలనిలో రియల్ ఎస్టేట్ కంపనీ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రముఖ టీవీ చానెల్స్, దినపత్రికలలో ఆకర్షణీయమైన యాడ్స్ ఇచ్చి తక్కువ ధరకే కమ్మదానం విలేజ్ ఫారూఖ్ నగర్ మండలంలో విల్లాలు నిర్మించి ఇస్తామని చెప్పగా ఆ యాడ్స్ చూసి నమ్మి ఆఫీస్‌కు వచ్చి బాధితురాలు రెండు విల్లాలు బుక్ చేసుకుంది.
 
ఒక్కోవిల్లాకు 29 లక్షల చొప్పున 2 విల్లాలకు  ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా 14 లక్షల రూపాయలు బ్యాంకు అకౌంట్ ద్వారా ట్రాన్సఫర్ చేసింది.10 రోజుల్లోనే విల్లా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఇంతవరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అనుమానం వచ్చి అడగడంతో రేపు మాపు అని దాటవేస్తూ కాలయాపన చేయగా మోసపోయమని గ్రహించి ద్వారాకపురి లోని ఆఫీసు వెళ్లగా అక్కడి నుంచి ఆఫీస్‌ను అమీర్పేట్ లోని సిరి ఎస్టేట్స్ తరలించినట్టుగా తెలిసింది. ఇలా విల్లాల పేరుతో చాలా మందిని మోసం చేసినట్టుగా తెలిసింది. 
 
ఎలాంటి ల్యాండ్ లేకున్నా ల్యాండ్ ఓనర్స్ దగ్గర నుండి డెవలప్‌మెంట్ పేరుతో కొంత మొత్తం అడ్వాన్స్ చెల్లించి అక్కడ ఎలాంటి వెంచర్ డెవలప్ చెయకున్న పేపర్ యాడ్స్‌వేసి వెంచర్ బ్రోచర్‌లు ప్రింట్ చేసి అమాయకులను మోసం చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలిసింది.
 
ఇందులో 1. greenland2 2. Shiva parvathi diamond space లాంటిపేర్లతో వెంచర్స్ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాట్టుగా విచారణలో తెలిసింది. ఇలాంటి కేసుల్లో ప్రధాన నిందితుడైన సుమన్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో సంప్రదించగలరని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.