శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (11:14 IST)

కొడుకు జులాయి.. మందలించిన తండ్రి.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

కొడుకు తీరుపై విసిగిపోయిన తల్లి మనస్తాపానికి గురైంది. అంతే మేడమీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటవ మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం తాటికొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాటికొండ గ్రామం, చిత్రపురం కాలనీలో నివాసం వుంటున్న పేటా పెంటయ్య, మౌనిక దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది. 
 
పెంటయ్య డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కుమారుడు మాత్రం జులాయిగా తిరుగుతూ కాలం గడిపాడు. ఈ వ్యవహారంపై కొడుకు పనీపాటా లేకుండా జులాయిగా తిరగడంపై మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం నెలకొంది. 
 
నిత్యం ఈ వ్యవహారాన్ని కళ్లారాజూస్తున్న తల్లి మనస్తాపానికి లోనైంది. కొడుకు తీరుతో విసిగిపోయి మేడ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.