సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 19 ఆగస్టు 2020 (16:30 IST)

ఒకవైపు చితి మంట.. మరోవైపు పుర్రెల మధ్య ఎమ్మెల్యే, ఆయనను చూసైనా మారాలి

అసలే కరోనా కాలం.. స్మశాన వాటికలకు వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. అలాంటిది తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్మశానంలోకి వెళ్ళిపోయారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి చితికి నిప్పంటించారు. అంతేకాదు కరోనాతో చనిపోయిన వారిని మానవత్వంగా చూడండి అంటూ నినాదాలు చేశారు.
 
ప్రజల్లో అపోహ పోగొట్టి, అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు తిరుపతి ఎమ్మెల్యే. కరోనాతో మృతి చెందిన వారి శరీరంలో కేవలం 6 గంటలు మాత్రమే వైరస్ ప్రభావం ఉంటుందని... అనవసరంగా ఎవరూ అపోహలకు గురి కావద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నారు.
 
కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులే అసలు దగ్గరకు రావడం లేదని.. సొంతవారు కూడా లేకుండా చాలామంది అనాధలుగా చనిపోతున్న దారుణ పరిస్థితి ఏర్పడుతోంది.. ఇలాంటి అపోహలను మానుకోవాలన్న ఉద్దేశంతో రెండురోజుల క్రితం గోవింద ధామంలో కరోనాతో చనిపోయిన వారికి దగ్గరుండి అంత్యక్రియలు చేశానని.. ప్రస్తుతం కరోనాతో మృతి చెందిన వారి చితికి నిప్పు పెట్టానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.