గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 30 అక్టోబరు 2017 (17:35 IST)

జీఎస్టీలో కొంత గందరగోళం వాస్తవమే... యనమల

జీఎస్టీ విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన పన్నుల విధానంలో కొన్ని లోటుపాట్లు ఉండటం సహజమని, కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కొన్ని వస్తువులపై జీఎస్టీ

జీఎస్టీ విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన పన్నుల విధానంలో కొన్ని లోటుపాట్లు ఉండటం సహజమని, కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని వినతి పత్రాలు అందజేయడం అనేది నిరంత ప్రక్రియ అన్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో గౌహతిలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. చింతపండు, గ్రానైట్ వంటి వాటిపై పన్ను తగ్గించాలని అడగనున్నట్లు మంత్రి చెప్పారు. 
 
పెట్రోల్ ధరలపై నిర్ణయం సీఎందే
సరిహద్దు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలలోని పెట్రోల్ ధరలతో పోల్చితే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని, దాంతో సరిహద్దు జిల్లాల్లో పెట్రోల్ బంకుల వ్యాపారం పడిపోయి, వారు నష్టపోతున్నట్లు తెలిపారు. పెట్రోల్ ధరలు తగ్గించే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవలసి ఉందని మంత్రి యనమల చెప్పారు.