గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మే 2023 (12:18 IST)

ఈతకొలనులో పడి మరో బాలుడు మృతి.. నడుముకు కట్టిన బెండు ఊడిపోవడంతో..

ఏపీలో ఈతకొలనులో పడి మరో బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఎర్ర నాగులపల్లిలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రితో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లిన మనోజ్ నడుముకు కట్టిన బెండు ఊడి పోవడంతో నీటిలో మునిగిపోయాడు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల అనకాపల్లి జిల్లాలో మూడు వారాల గ్యాప్‌లో ఇద్దరు చిన్నారులు ఈత సరదాకు బలైన సంగతి తెలిసిందే.