1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జులై 2020 (20:58 IST)

సెల్ ఫోన్ ఛార్జర్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది.. ఎలాగంటే?

సెల్ ఫోన్ ఛార్జర్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని లింగంపల్లికి చెందిన మధుసూదన్ అనే ఓ యువకుడు కడప ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మధుసూదన్ తండ్రి తన చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లి ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి పనిచేస్తుంది. 
 
అందుకని మధుసూదన్ తన బంధువులైన అమ్మమ్మ, పిన్ని ఇంటి వద్ద ఉండి ఆర్ట్స్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఆదివారం ఓ సెల్ ఫోన్ చార్జర్ విషయమై మధుసూదన్‌కు రత్నం, కృష్ణ, ఫణీంద్ర, నాగార్జున, పవన్‌కుమార్‌ అనే ఐదుగురు వ్యక్తులతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. 
 
అది గ్రామస్థాయి కావడంతో మధుసూదన్‌కు సమీప బంధువైన ఓ వ్యక్తి ఆ గొడవ ఆపి ఇరువురికి సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించేశారు. అయినా ఐదుగురు వ్యక్తులు ఈ ఘర్షణను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా మధుసూదన్ చంపేయాలని పథకం అనుకొని.. ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. 
 
మూడు సార్లు మధుసూదన్ ఛాతీపై కత్తిపోట్లు పడడం వలన తీవ్రంగా రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించాడు. హత్య చేసిన వెంటనే ఐదుగురు వ్యక్తులు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.