సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (14:38 IST)

జగన్‌తో సెల్ఫీ.. ఫోన్ పోగొట్టుకున్న పెద్దమ్మ... కొత్త ఫోన్ కొనిచ్చిన సీఎం

ఇటీవల వరద బాధిత జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని సరస్వతి నగర్‌ పర్యటన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. 
 
ఆ సమయంలో విజయ అనే మహిళ సెల్‌ఫోన్ జారి నీటి కాలువలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సీఎం జగన్.. పెద్దమ్మా.. మీకు కొత్త ఫోన్ ఇప్పించే బాద్యత నాది. బాధపడవద్దు అని హామీ ఇచ్చారు. 
 
ఈ హామీని సీఎం జగన్ నెరవేర్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీష్ ఆ పెద్దమ్మకు కొత్త మొబైల్ ఫోన్ కొనిచ్చారు. ఈ ఫోనును డాక్టర్ రవికాంత్ ద్వారా ఆ మహిళకు చేర్చారు. దీంతో ఆ మహిళ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.