సినిమా టిక్కెట్ ధరలపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి : సి.కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ కోరారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ తెలుగు చిత్రపరిశ్రమకు సాయం చేసేలా ఉండాలన్నారు.
ముఖ్యంగా, ఇపుడున్న టిక్కెట్ ధరల సమస్యపై ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. యువరత్న బాలకృష్ణ నటించిన అఖండ పూర్తిగా హీరో స్టామినాపై విజయవంతంగా పూర్తిస్థాయి కలెక్షన్లను రాబట్టిందన్నారు.
గతంలో వైఎఎస్ఆర్ హయాంలో కూడా చిరంజీవి సినిమాకు కూడా ఇలాంటి సమస్య వచ్చిందన్నారు. ప్రజల నుంచి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించినా వైఎస్ సినిమా టిక్కెట్ల ధరలను పెంచారని గుర్తుచేశారు.
అయితే, తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్ వరకూ ప్రతి ఒక్కరూ మంచి చేశారన్నారు. కానీ ఇటీవలి కాలంలో కొంత గ్యాప్ వచ్చిందని గుర్తుచేశారు.