బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (14:26 IST)

పవన్ కల్యాణ్ ''సిట్ అంట్ స్టాండ్'' తీరు మార్చుకోవాలి.. అలాచేస్తే అండగా ఉంటా: జగన్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీరు మార్చుకోవాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. పవన్ ఏపీ సీఎం చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటున్నారు.. లేచి నిల్చోమంటే నిలుస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు సి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీరు మార్చుకోవాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. పవన్ ఏపీ సీఎం చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటున్నారు.. లేచి నిల్చోమంటే నిలుస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే రీతిలో పవన్ వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. ఆ పరిస్థితి నుంచి పవన్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ చెప్పుకొచ్చారు. 
 
విజయవాడలో ఏపీ బడ్జెట్‌పై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి.. పవన్ గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. తాను ప్రెస్ మీట్ పెట్టింది ఏపీ బడ్జెట్‌పై మాట్లాడేందుకని.. పవన్ గురించి కాదని చెప్పారు. 
 
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పవన్ కల్యాణే కాదు ఎవరు పోరాడేందుకు ముందుకు వచ్చినా ఆప్యాయంగా స్వాగతిస్తానని తెలిపారు. వారికి తోడుగా నిలిచే కార్యక్రమం కూడా చేస్తామని జగన్ అన్నారు. కానీ పవన్‌లో బాబు మాట వినే తీరు మారాలని జగన్ సూచించారు.
 
కాగా 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తానని ప్రకటించారు. దీంతో ఏపీలో జగన్ పార్టీకి పవన్ గట్టిపోటీనిచ్చేలా కనిపిస్తున్నారు. ఈ కారణంగా పవన్‌తో సత్సంబంధాలను కొనసాగించేందుకు జగన్ సుముఖంగా ఉన్నారు. అలాగే జగన్‌పై కూడా పవన్ ఇప్పటిదాకా ఎలాంటి విమర్శలు చేయలేదు. ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడితే జనసేన కూడా వారి వెన్నంటి వుంటుందని వ్యాఖ్యానించారు.