ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (17:06 IST)

వైయస్ షర్మిలకు కుమారుడి నిశ్చితార్థం రాజకీయాలకు వేదిక అవుతుందా?

YS Raja Reddy, Atluri Priya
YS Raja Reddy, Atluri Priya
వైయస్ షర్మిలకు కుమారుడి నిశ్చితార్థం రాజకీయాలకు వేదిక అవుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‎లో జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం వేడుకకు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, భారతి హాజరుకానున్నారు.
 
నిన్ననే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితుల య్యారు. దీంతో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్దలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నరని తెలుస్తోంది. ఈ వేడుకలో తన రాజకీయ పాత పరిచయాలన్నింటికీ కుమారుడి ఎంగేజ్మెంట్ వేదికయింది.