Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసులో సూత్రధారి అతడే: సొంత అల్లుడే..?

Written By సెల్వి
Updated: గురువారం, 23 డిశెంబరు 2021 (11:47 IST)
వైఎస్ వివేకా మాజీ డ్రైవర్, హత్య కేసు నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి వివేకా హత్య జరిగిన తీరును బయటపెట్టిన విషయం తెలిసిందే. వివేకాను గొడ్డలితో నరికి, గుండెలపై బాది దారుణంగా హత్య చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
 
అయితే.. వివేకా హత్య కేసులో అసలు సూత్రధారి వేరంటూ మరో సంచలన విషయం బయటపడింది. వివేకాను ఆయన సొంత అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డే హత్య చేయించారంటూ.. ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ కుమార్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన భరత్ యాదవ్ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.  
 
ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని.. దీనికి ప్రత్యేక సూత్రధారుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డేనంటూ భరత్ యాదవ్ ఆరోపించాడు. వివేకానంద రెడ్డి సన్నిహితురాలు షమీంకు ఆస్తి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఆయన్ను హత్య చేశారని.. ఈ విషయాలన్నీ సునీల్ యాదవే నేరుగా తనకు చెప్పినట్లు మీడియా ఎదుట వివరించారు.
 
ఇన్నాళ్లూ ప్రాణభయంతోనే ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పలేదని.. తనకు తెలిసిన అన్ని విషయాలను బయటపెడుతున్నానంటూ భరత్ యాదవ్ మీడియా ఎదుట వివరించారు. 

అన్నీ చూడండి

Merlapaka Gandhi :కొన్నిసార్లు ఆ కథ నాకే నచ్చదు, గేప్ కు కారణం అదే : మేర్లపాక గాంధీ

గాయం రూపంలో దేవుడు బలవంతంగా సెలవు ఇచ్చాడు : రష్మిక మందన్నా

Tej: ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావాలనే కోరిక ఉంది : దందా డైరెక్ట‌ర్ ఆదిత్య దేవులపల్లి

Sid Sriram: ది రెడ్ బ్యాగ్ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన మెలోడీ సాంగ్

డీప్‌ఫేక్ ఫోటోలు తక్షణం తొలగించండి.. లేదా చట్టపరమైన చర్యలు : మృణాల్ ఠాకూర్

తర్వాతి కథనం
Show comments