శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (20:19 IST)

వైఎస్ వివేకా హత్య కేసు.. శంకర్ రెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా దేవి రెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు.
 
హైదరాబాద్‌‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. అరెస్ట్‌ చేసిన అనంతరం… దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు.
 
కాగా మూడు రోజుల కింద ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి డ్రైవర్‌ దస్తగిరి సిబిఐ అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక విషయాలను తెలిపాడు దస్తగిరి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి కారణమని చెప్పాడు.