ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 22 డిశెంబరు 2021 (12:44 IST)

గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తల వీరంగం!

సీఎం జగన్ పుట్టిన రోజున‌ చాలా చోట్ల వేడుక‌లు జ‌రిగాయి. కానీ, గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో అదో జ‌ల్లిక‌ట్టులా సాగింది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ పుట్టిన రోజు సంబ‌రం అంటూ న‌గర వీధుల్లో ర్యాలీ చేశారు. అంతేకాదు... ఏకంగా క‌ర్ర‌ల‌తో కొట్టుకున్నారు... ఉన్మాదంతో క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లు కొట్టారు. తాగిన మైకంలో జ‌ల్లిక‌ట్టు మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. దీనితో న‌ర‌స‌రావుపేట బస్టాండ్ వద్ద భ‌యాన‌క ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. 
 
 
న‌ర‌స‌రావుపేట బ‌స్టాండ్ వ‌ద్ద నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు యువకులను మద్యం మత్తులో కర్రలతో  చితకొట్టి తాలిబన్లను తలపించారు వైసీపీ కార్యకర్తలు. దీనితో ఇద్దరు వ్యక్తులకు గాయాల‌య్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. భయబ్రాంతులకు గురైన స్థానికులు, ప్రయాణికులు ఇదేం పుట్టిన‌రోజు వేడుక‌లురా బాబూ అని బెంబేలెత్తిపోయారు.