శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (11:57 IST)

వెలగపూడి పంచాయతీ ఆఫీసుకు వైకాపా రంగులు... చెరిపేసిన రైతులు

అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతుంది. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. వెలగపూడిలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి వైసీపీ నేతలు ఇటీవల తమ పార్టీ రంగులు వేసుకున్నారు. అయితే, ఇప్పుడు నిరసనల నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంపైకి ఎక్కిన వైసీపీ కార్యకర్తలు తమ సొంత పార్టీ రంగులను తుడిచేస్తూ నలుపు రంగు వేస్తున్నారు. వారికి గ్రామస్థులు మద్దతు పలికారు.
 
అయితే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులను నెట్టుకుని మరీ పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేస్తున్నారు. భూములు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేయొద్దని రైతులు నినాదాలు చేస్తున్నారు.