గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (11:35 IST)

వైకాపా నాలుగో జాబితా రిలీజ్... ఐదుగురు సిట్టింగులకు నో ఛాన్స్

ysrcp flag
ఏపీలోని అధికార వైకాప పార్టీ సమన్వయకర్తల నాలుగో జాబితాను గురువారం రిలీజ్ చేసింది. ఇందులో ఐదుగురు సిట్టింగ్ ప్రజాప్రతినిధులకు మొండి చేయి చూపించింది. అలాగే, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న కె.నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. తాజా జాబితాలో ఒక ఎంపీ ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మార్చింది. సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు దళిత సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. ఐదుగురు సిట్టింగులకు టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. 
 
సీట్లు కోల్పోయిన వారిలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూర ఎమ్మెల్యే రక్షణనిధి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్‌లకు టిక్కెట్లు ఇవ్వలేదు. గంగాధర ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభ అభ్యర్థికా ప్రకటించారు.