శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

దళిత ద్రోహి జగన్ - విగ్రహాన్ని చూసి మోసపోవద్దు.. జరిగిన దారుణాలను మర్చిపోవద్దు!

ambedkar statue
దళిత ద్రోహి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ ఆరోపించింది. విగ్రహాన్ని చూసి మోసపోవద్దని, జరిగిన దారుణాలు మర్చిపోవద్దని రాష్ట్రంలోని దళిత ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇదే విషయంపై ఆ పార్టీ ఎక్స్ వేదికగా జగన్ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు, నేరాలు ఘోరాలతో ఓ జాబితాను రిలీజ్ చేసింది. "దళితులపై అధికార గణం జరిపిన దాడులని, వైసీపీ చేసిన మోసాలని అంబేద్కర్ మహనీయుడి విగ్రహం వెనుక దాచిపెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారని, 5 ఏళ్ళ జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై దాడులు జరిగాయని ఆరోపించింది. 
 
నా ఎస్సీలు, నా ఎస్టీలు అని దీర్గాలు తీసే జగన్‌కు దళితులపై తాను పలికే చిలక పలుకుల్లో పావు శాతమైనా ప్రేమ ఉంటే దళితులపై ఇన్ని దారుణాలు జరిగేవా? అని నిలదీశింది. ఎన్నికల వరుకు పథకాలు, ఎన్నికలప్పుడు విగ్రహాలు ఏర్పాటా అంబేద్కర్ మహనీయుడు కోరుకుంది? సమాజంలో దళితులపై వివక్ష పోవాలనుకున్నాడు. కానీ కంసమామ జగన్ దళితులని హత్యలు చేసినవారిని చేరదీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే, విగ్రహాన్ని చూసి మోసపోవద్దు.. జరిగిన దారుణాలను మర్చిపోవద్దు అంటూ పిలుపునిచ్చింది.