శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (13:43 IST)

ప్యాకేజీలు పుచ్చుకునే అలవాటు లేకే సస్పెండ్‌కు గురయ్యా : వైకాపా ఎమ్మెల్యే

తనకు ప్యాకేజీలు తీసుకునే అలవాటు లేదనీ అందువల్లే తాను అసెంబ్లీ నుంచి ఒక యేడాది పాటు సస్పెండ్‌కు గురైనట్టు వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. ఆమె ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

తనకు ప్యాకేజీలు తీసుకునే అలవాటు లేదనీ అందువల్లే తాను అసెంబ్లీ నుంచి ఒక యేడాది పాటు సస్పెండ్‌కు గురైనట్టు వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. ఆమె ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తప్పనిసరిగా తీసుకురావాలని తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే నిజాయితీగా పోరాడుతున్నారని, మిగతా పార్టీలన్నీ హోదా పేరిట ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. 
 
తన నోరు అదుపులో లేదని చెబుతూ, అందుకే సస్పెండ్ చేశామని తెలుగుదేశం చెప్పుకుంటోందని, వాస్తవానికి తనకు ప్యాకేజీలు పుచ్చుకునే అలవాటు లేనందునే సస్పెండ్ చేశారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మాత్రమే కావాలని, తెలుగుదేశం నేతలకు డబ్బుల కట్టలు అందించే ప్యాకేజీలేమీ తమకు వద్దని రోజా తెలిపారు.