శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (19:12 IST)

సిగ్గులేక సంబరాలా... నేనిలానే మాట్లాడుతా... సస్పెన్షన్ అంటే కోర్టుకెళతా... ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవడానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చాలక సిగ్గు లేకుండా సం

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవడానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చాలక సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. తనపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు వేస్తే మాత్రం మళ్లీ న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. 
 
వచ్చే 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనీ, సింహం(జగన్) సింగిల్‌గానే వస్తుందనీ, తన తడాఖా ఏమిటో చూపిస్తుందని అన్నారు. దమ్ముంటే వైసీపీ నుంచి తెదేపాలో చేరిన 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అలా రాజీనామా చేయించి ఆ 21 మందిని గెలిపించుకోండి చూద్దామని రోజా తెదేపాకు సవాల్ విసిరారు.