శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 15 జూన్ 2017 (14:54 IST)

ఆయనలా చెప్పారట... రోజాకు కౌంట్‌డౌన్ స్టార్ట్... జగన్ ఆ పని చేస్తే ఔట్...

వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు పడిపోయింది. దీనితో పార్టీకి నష్టమా...? లాభమా...? అనే మీమాంస ఆ పార్టీని వెన్నాడుతోందట. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నారు. ఆయన ఓ నివేదిక ఇచ్చారట

వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు పడిపోయింది. దీనితో పార్టీకి నష్టమా...? లాభమా...? అనే మీమాంస ఆ పార్టీని వెన్నాడుతోందట. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నారు. ఆయన ఓ నివేదిక ఇచ్చారట. 
 
ఆ నివేదికలో రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల పార్టీకి లాభం లేకపోగా నష్టం అని తేల్చి చెప్పారట. ఆ నివేదికను చూసిన జగన్ కాస్తంత షాక్ తిన్నప్పటికీ చర్యలు తీసుకోక తప్పదన్న ఆలోచనకు వచ్చేశారట. అధికార పక్షాన్ని ఎండగట్టడంలో దిట్ట అయినప్పటికీ ప్రజల్లో మైలేజి రావడంలో మైనస్ మార్కులు పడుతున్నాయని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం. 
 
దీనితో జగన్ వారి స్థానాల్లో వేరేవారిని నియమిస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు లగడపాటి రాజగోపాల్ ఇటీవలే... జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నంతకాలం చంద్రబాబు నాయుడుకి దిగులే లేదని తేల్చి చెప్పడాన్ని కూడా జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.