శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :vijayawada , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:16 IST)

త‌గ‌ల‌బ‌డుతున్న స్పిన్నింగ్ మిల్లు... ప‌క్క‌నే కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలు!

కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లి లో భారీ అగ్నిప్ర‌మాదంలో ఓ స్పిన్నింగ్ మిల్ త‌గ‌ల‌బ‌డింది. స్థానిక విజయ పారి మిల్స్ లో ప్లాస్టిక్ సంచులు తయారీ చేస్తున్న కంపెనీలో తెల్లవారుజామున మంట‌లు  చెలరేగాయి.

అగ్ని కీల‌లు భారీగా వ్యాపించ‌డంతో మంటలను అదుపులోకి తీసుకురాలేక  ఫైర్ సిబ్బంది. కష్టాలు పడ్డారు. పక్కన పలు ఫ్యాక్టరీలు ఉండటంతో స్థానిక ప్రజలు, గ్రామస్తులు భయందోళన వ్య‌క్తం చేశారు. 
 
ఫ్యాక్టరీలో టిన్నర్, ఇతరత్ర కెమికల్స్ ఉండటంతో అదుపులోకి తీసుకురాలేనంతగా మంట‌లు చెలరేగాయి. అత్యవసర సమయానికి ఫైర్ ఇంజన్ లో నీళ్లు అయిపోవడంతో పోలీసులు పరుగులు పెట్టారు. చివ‌రికి వేరే ప్రాంతం నుంచి ఫైరింజ‌న్లు రావ‌డంతో ప‌రిస్థితి కొంత అదుపులోకి వ‌చ్చింది.