ఎంత వేడైనా అక్కడ మాత్రం చల్లగానే ఉంటుంది... ఆంధ్రాలో మరో ఊటి.. ఎక్కడ?

talakona forest
జె| Last Modified మంగళవారం, 7 మే 2019 (21:50 IST)
ప్రకృతి అందాల మధ్య అందమైన జలపాతం తలకోన. శేషాచలం అటవీ ప్రాంతంలో వున్న ఈ జలపాతం సంవత్సరం తరబడి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎత్తైన కొండల నుంచి ఎగసిపడుతున్న ఈ జలపాతం అందాలు ప్రకృతికాంతకు మరింత సొబగులు అద్దుతున్నాయి. ఓ వైపు ఆకాశం అంచున వున్న కొండలను తాకుతున్న మేఘాలు, మరోవైపు చిరు జల్లల మద్య జలపాతాన్ని సందర్శించడం ఓ అద్బుతమైన అనుభవం.

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో వున్న తలకోన జలపాతం ప్రత్యేకత మరే జలపాతానికి లేదు. బాకారాపేట నుంచి 25 కిలోమీటర్లు లోపలికి వెళితే మనకు దట్టమైన అడవుల మధ్య కనిపిస్తుంది తలకోన జలపాతం. జలపాతం కంటే ముందు మనకు దర్శనమిస్తాడు సిద్దేశ్వర స్వామి. పురాతన ఈదేవాలయంలో స్వామి వారిని దర్శంచి మనం జలపాతం వద్దకు వెళ్ళచ్చు. జలపాతం సమీపం లోని అర కిలోమీటర్ వరకు రహదారి వున్నప్పటికి నడిచే వెళితే వచ్చే అనుభూతి మరింత ప్రత్యేకం.

ఎత్తైనా కొండల మద్య నడుస్తు వెళుతుంటే మేఘాలు మనకు తాకినట్లు కనిపిస్తాయి. అక్కడక్కడ చిన్న చిన్న వాగులు దాటుతు వెళ్ళడం మరింత ప్రత్యేకం. జలపాతానికి దగ్గరలోను మనకు లోయ పక్కన మార్గం కనిపిస్తుంది. నడిచి వెళ్ళాల్సిన దారి. ఇక్కడ నుంచి మనం జలపాతం వద్దకు వెళుతుంటే మనకు లోయలోంచి హోరున నీరు ప్రవహిస్తున్నశబ్ధం చెవులకు ఇంపుగా వుంటుంది. అటు వెళుతున్నప్పుడు అందమైన చెట్లతో పాటు మనలను ఇబ్బంది పెట్టే కోతులు కూడా వుంటాయి. అంతేకాకుండా వందల అడుగుల ఎత్తైన చెట్లు కనిపిస్తాయి. వీటన్నింటి మధ్య మనం జలపాతం వద్దకు చేరితే అద్భుతమైన అందాలు కనువిందు చేస్తాయి.

జలపాతం మొదటి ప్రాంతం దాటి రెండవ ప్రాంతం వద్దకు వెళ్ళడం కొంచెము ప్రమాదకరంగా వున్నప్పటికి అక్కడికివెళితే మరింత అనుభూతిని ఇస్తుంది. జలపాతం వంద అడుగుల ప్రవాహం అక్కడ వుంటుంది. ఇక్కడ జలపాతం దూకుడు ఎక్కువగా వుంటుంది. అయినప్పటికి సాహాస వంతులైన యువకులు మాత్రం అక్కడి చేరు జలపాతం దూకుడు కంటే తామే బలమైన వారమంటుంటారు.

తలకోనలో తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్స్ జరుగుతుంటాయి.అప్పట్లో ప్రముఖ తమిళ డైరక్టర్లు తమ సినిమాలను ఈనెల కోనలో చేసారు. ప్రస్తుతం తమిళ చిత్రాల షూటింగ్స్ ఇక్కడ రెగ్యులర్‌గా జరుగుతుంటాయి. తలకోన అందాలను చూడటానికి ప్రతిరోజు వందల సంఖ్యలో వస్తుంటారు. అయితే శని,అది,సోమ వారాలలో అయితే ఇది వేలకు చేరుకుంటుంది.దీనిపై మరింత చదవండి :